సినీ ప్రముఖుల ఇండ్లపై దాడిని ఖండించిన సీఎం

  • శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని డీజీపీ, సీపీకి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: సినీ ప్రముఖుల ఇండ్లపై దాడిని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. డీజీపీ జితేందర్ నుంచి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక పోలీసులు,ఇంటలిజెన్స్ అధికారులు  ఫోటోలతో వివరాలు అందించారు.